ETV Bharat / state

క్షయను సమూలంగా నిర్మూలిద్దాం: గవర్నర్ - Governor Tamilsai Soundararajan on TB Cases

నివారణకు సాధ్యమైన క్షయను నియంత్రించలేకపోవడం బాధాకరమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్​భవన్​లో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Governor Tamilsai Soundararajan on TB Cases in Telangana
క్షయ రహిత సమాజం కోసం శ్రమిద్దాం: గవర్నర్
author img

By

Published : Feb 26, 2020, 10:05 PM IST

క్షయను పూర్తిగా నివారించాలని గవర్నర్ తమిళిసై అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​ సహా రాష్ట్రంలో క్షయ వ్యాధిగ్రస్తులు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. క్షయ వ్యాధిగ్రస్తులందరికీ నాణ్యమైన రోగ నిర్ధారణ, చికిత్స అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించాలని జిల్లా వైద్యాధికారి వెంకట్, టీబీ సంఘం ప్రధాన కార్యదర్శి సుధీర్ ప్రసాద్​లను ఆదేశించారు.

కొన్నేళ్లలోనే రాష్ట్రంలో క్షయను పూర్తిగా నిర్మూలించేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవమైన మార్చి 24న జంటనగరాల్లోని అన్ని బస్తీలు, నైట్ షెల్టర్లు, ఇతర ప్రాంతాల్లో టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. క్షయ, డెంగ్యూ, క్యాన్సర్ రోగాలపై విస్తృతంగా పరిశోధనలు చేశానన్న తమిళిసై... సమాజ సహకారంతో ఈ మూడు రోగాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు.

రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన లక్షా 80వేల మంది సభ్యులు క్షయరహిత సమాజం కోసం క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారని గవర్నర్ చెప్పారు. హైదరాబాద్​లోని ఆసుపత్రులు ఇతర జిల్లాలు, రాష్ట్రాలతోపాటు అమెరికా, సౌదీఅరేబియా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన వారికి కూడా టీబీ చికిత్సను అందిస్తున్నామని హైదరాబద్ జిల్లా టీబీ నియంత్రణాధికారి చాలాదేవి తెలిపారు.

క్షయ రహిత సమాజం కోసం శ్రమిద్దాం: గవర్నర్

ఇవీ చూడండి: టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.