ETV Bharat / state

కరోనా కట్టడి.. తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో గవర్నర్​ సమీక్ష

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ కీలక సంప్రదింపులు జరిపారు. నిపుణులు, సంబంధిత వ్యక్తులతో గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

tamilisi video conference
కొవిడ్​ కట్టడి చర్యలపై నిపుణులతో గవర్నర్​ సమీక్ష
author img

By

Published : Jun 15, 2020, 3:33 PM IST

రాష్ట్రంలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్​ తమిళిసై... నిపుణులు, సంబంధిత వ్యక్తులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు, మాజీ డీజీపీ హెచ్​జే దొర, సీసీఎంబీ సంచాలకులు రాకేష్ మిశ్రా, అపోలో గ్రూప్ హరిప్రసాద్, ఐఎంఏ తెలంగాణ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి, కోవిడ్​పై పరిశోధన చేస్తున్న స్వామినాథన్​తోపాటు రాష్ట్రంలో ప్లాస్మా చికిత్స పొందిన మొదటి కరోనా రోగి వంశీమోహన్​ సమీక్షలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి... ప్రస్తుత పరిస్థితులపై చర్చించిన గవర్నర్... ముందుకెళ్ళాల్సిన ప్రణాళికలపై సమాలోచనలు జరిపారు. వీటన్నింటినీ డాక్యుమెంటేషన్ చేసి కరోనా వైరస్​ను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు.

ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.