Governor Tamilisai comments about the dairy sector: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన పీవీ నరసింహారావు పశు, విజ్ఞాన విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ వర్చువల్‌గా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కొత్త జీవితంలో ఎదురయ్యే సవాళ్లు సమర్థంగా అధిగమిస్తూ అన్నదాతకు మరింత చేరువైన నాణ్యమైన సేవలందించాలని విద్యార్థులకు తెలిపారు. వెటర్నరీ, డెయిరీ, ఫిషరీస్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో పట్టభద్రులకు గవర్నర్ శుభాంకాక్షలు తెలియజేశారు.
"దేశంలో వ్యవసాయ అనుబంధ కీలక పాడి, మత్స్య, కోళ్ల పరిశ్రమ రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అపారమైన అవకాశాలు ఉన్నాయి. యువతకు ఎదురయ్యే సవాళ్లు సమర్థంగా అధిగమిస్తూ అన్నదాతకు మరింత చేరువైన నాణ్యమైన సేవలందించాలి".-డాక్టర్ తమిళసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్
యువత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలగా ఎదగాలి: కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ సతీష్‌కుమార్ గార్గ్.. ఆహార, పౌష్టికాహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న యానిమల్, మత్స్య, పాడి రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్న దృష్ట్యా.. ప్రభుత్వం ఉద్యోగం అంటూ చూడకుండా సొంతంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలగా విద్యార్థులు ఎదగాలని సూచించారు. అంకుర కేంద్రాల వ్యవస్థాపకులుగా ఎదిగి మరో పదికి ఉపాధి అకాశాలు కల్పించాలని ఆయన అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిన నేపథ్యంలో ఎనిమిదిన్నర ఏళ్ల కాలంలో పీవీ నరసింహారావు పశు, విజ్ఞాన విశ్వవిద్యాలయం విద్యా, పరిశోధన, విస్తరణలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించిందని వర్సిటీ వీసీ రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెటర్నరీ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల పట్టభద్రులు 239 మందికి రవీందర్‌రెడ్డి, గార్గ్ చేతుల మీదుగా పట్టాలు ప్రధానం చేశారు. వీరిలో 12 మంది విద్యార్ధులకు బంగారు పతకాలు ప్రదానోత్సవం చేశారు. బోధన, పరిశోధన, విస్తరణ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వివిధ విభాగాల అధిపతులు, పలువురు ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలకు కూడా పురస్కారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ యానిమల్ సైన్సెస్ ఉపకులపతి ప్రొఫెసర్ సతీష్‌కుమార్ గార్గ్, పీవీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవీందర్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రాంచందర్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వీరోజిరావు, వెటర్నరీ డీన్ ఆఫ్ ఫ్యాకల్టీ రఘునందన్‌రావు, భోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు రమ్మని ఆహ్వానం రాలేదు: తమిళిసై
'పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలు'
మర్మాంగానికి పిన్నీసులు.. నగ్నంగా మృతదేహం.. అదే కారణమా?
సీబీఐ కార్యాలయానికి కేజ్రీవాల్.. 'అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తా'