ETV Bharat / state

దేశ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్​ - దేశ సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్​

దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సూచించారు.హైదరాబాద్​ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏక్​ భారత్​ శ్రేష్ఠ భారత్​ పేరుతో నిర్వహించిన యూత్​ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

Governor tamilisai soundararajan spoke On Nethaji Jayanthi
దేశ సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్​
author img

By

Published : Jan 23, 2020, 5:16 PM IST

ఆధునిక జీవన శైలిని ఆస్వాదిస్తూనే... దేశ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పేరుతో నిర్వహించిన యూత్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువత ఏ రంగాన్ని ఎంచుకున్నా సంతోషంగా ముందుకు సాగాలని... నవభారత నిర్మాణం కోసం ఉత్సాహంగా పాలుపంచుకోవాలని సూచించారు.

అనుకున్న రంగంలో రాణించలేనప్పుడు మరో రంగాన్ని ఎంచుకోవాలి తప్ప... ఆత్మహత్యల వంటి పిరికి పంద చర్యలకు పాల్పడరాదని కోరారు. సుభాష్ చంద్రబోస్ యువతకు ఇచ్చిన సందేశాలను గుర్తుచేస్తూ... దేశం కోసం, జాతికోసం ప్రతి పౌరుడూ పాటు పడాలని... ఆయన జ్ఙాపకాలు యువతకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటాయని తెలిపారు . సుభాష్ చంద్రబోస్ ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి 4వ స్థానంలో నిలిచినప్పటికి... స్వతంత్ర భారత్​లో పని చేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని కూడా వదులుకున్న గొప్పవ్యక్తి అని కొనియాడారు.

దేశ సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్​

ఇవీ చూడండి: 'వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.