ETV Bharat / state

పెండింగ్​ బిల్లుల వివాదం.. స్పందించిన గవర్నర్​.. ఏమన్నారంటే..? - undefined

Governor on Pending Bills Issue: రాష్ట్రప్రభుత్వం, గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ల మధ్య వివాదం.. మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో గవర్నర్​ ప్రసంగంతో పరిస్థితులు చక్కబడ్డాయనుకునేలోపే.. పెండింగ్​ బిల్లుల విషయమై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో మరోసారి హాట్​టాపిక్​గా మారింది. దీనిపై తాజాగా గవర్నర్​ స్పందించారు. ఇంతకీ తమిళిసై సౌందరరాజన్ ఏమన్నారంటే..?

Governor on Pending Bills Issue
Governor on Pending Bills Issue
author img

By

Published : Mar 3, 2023, 12:35 PM IST

Governor on Pending Bills Issue: పెండింగ్​ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ట్విటర్ వేదికగా స్పందించారు. రాజ్​భవన్​.. దిల్లీ కంటే దగ్గరగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశించి ట్వీట్​ చేశారు. ఈ క్రమంలోనే సీఎస్​గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్​భవన్​కు రావడానికి సమయం లేదా అని ప్రశ్నించిన గవర్నర్​.. ప్రొటోకాల్​ లేదు, అధికారికంగా రాలేదన్నారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్​ కలవలేదన్న తమిళిసై సౌందరరాజన్​.. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.

''రాజ్‌భవన్ దిల్లీ కంటే దగ్గరగా ఉంది. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు రావడానికి సమయం లేదా? అధికారికంగా రాలేదు, ప్రొటోకాల్ లేదు. కనీసం మర్యాద పూర్వకంగా కూడా సీఎస్ కలవలేదు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయి.''-ట్విటర్​లో గవర్నర్​ తమిళి సై సౌందరరాజన్

  • Dear @TelanganaCS Rajbhavan is nearer than Delhi. Assuming office as CS you didn't find time to visit Rahbhavan officially. No protocol!No courtesy even for courtesy call. Friendly official visits & interactions would have been more helpfull which you Don't even intend.

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ అసలు విషయం.. 2022 సెప్టెంబర్​లో జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టి.. ఉభయసభల ఆమోదం అనంతరం రాజ్​భవన్​కు పంపింది. వాటిల్లో జీఎస్టీ సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదముద్ర వేసిన గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​.. మిగతా ఏడు బిల్లులను అప్పటి నుంచి పెండింగ్​లోనే ఉంచారు. దాదాపు 6 నెలలుగా 7 బిల్లులు రాజ్​భవన్​లో పెండింగ్​లోనే ఉండగా.. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరో 3 బిల్లులను గవర్నర్​ ఆమోదం కోసం పంపింది. వీటికీ ఆమోద ముద్ర పడకపోవడంతో గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

శాసన సభ, శాసన మండలి ఆమోదించుకున్న బిల్లులకు గవర్నర్​ ఆమోదం తెలిపేలా ఆదేశించాలంటూ ప్రభుత్వం తరఫున సీఎస్​ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. గవర్నర్​ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. బిల్లులను రాజ్​భవన్​కు పంపి దాదాపు 6 నెలలు కావస్తుండటంతో విధి లేకే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రభుత్వం పిటిషన్​లో తెలిపింది. చాలా కాలంగా బిల్లులు పెండింగ్​లో ఉండటంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే గవర్నర్​ పెండింగ్​లో ఉన్న 10 బిల్లులకు ఆమోదముద్ర వేసేలా ఆదేశించాలని కోరింది.

గవర్నర్​ వద్ద పెండింగ్​లో ఉన్న బిల్లుల వివరాలు..

  • వ్యవసాయ విశ్వ విద్యాలయ చట్ట సవరణ
  • పురపాలక నిబంధనల చట్ట సవరణ
  • మోటారు వాహనాల చట్ట సవరణ
  • పబ్లిక్​ ఎంప్లాయ్​మెంట్​ చట్ట సవరణ
  • విశ్వ విద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు
  • ములుగులోని అటవీ కళాశాలను అటవీ విశ్వ విద్యాలయంగా మార్పు
  • అజామాబాద్​ ఇండస్ట్రియల్​ ఏరియా చట్టసవరణ
  • ప్రైవేట్​ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ
  • పంచాయతీరాజ్​ చట్ట సవరణ
  • పురపాలక చట్ట సవరణ

ఇవీ చూడండి..

గవర్నర్‌ వద్ద పెండింగ్ బిల్లులపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

కుమారుడితో కలిసి టెన్త్​ పరీక్షలకు తల్లి.. 'ఇలా జరగడం ఇదే మొదటిసారి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.