Governor Tamilisai: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రాజ్‌భవన్ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాలు పంపిణీ చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రతి ఇంటా జాతీయ పతకాన్ని ఎగురవేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునకు అనుగుణంగా 75 మంది విద్యార్థులకు త్రివర్ణ పతాకాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోటు పుస్తకాలనూ అందజేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను భారతీయులందరూ గర్వంతో, సంతోషంతో నిర్వహించుకోవాలని తమిళిసై సూచించారు.
ఇవీ చదవండి: రాజగోపాల్ వ్యవహారం.. టీకాంగ్రెస్ ముఖ్యనేతలకు హైకమాండ్ పిలుపు
సంజయ్ రౌత్ ఇంటి నుంచి నగదు స్వాధీనం.. ప్రత్యేక కవర్లో రూ.10 లక్షలు!