ETV Bharat / state

భారత్ వైపే ప్రపంచ దేశాల చూపు: గవర్నర్​

వరల్డ్ తమిళ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ మెడికల్ ఎక్సలెన్స్ ఈవెంట్​లో గవర్నర్ తమిళిసై వర్చువల్​గా పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్​ తయారీ, పరిశోధనలో దేశంలో వేగం పెరిగిందని అన్నారు. ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్​లలో వ్యాక్సిన్ పరిశోధనా కేంద్రాలను సందర్శించటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

governor tamilisai said The eyes of the nations of the world towards India
భారత్ వైపే ప్రపంచ దేశాల చూపు: గవర్నర్​
author img

By

Published : Nov 28, 2020, 9:08 PM IST

కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ, సరఫరాలో భారత్ గ్లోబల్ లీడర్​గా అవతరించనుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వరల్డ్ తమిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ మెడికల్ ఎక్సలెన్స్ ఈవెంట్​లో వర్చువల్​గా గవర్నర్ పాల్గొన్నారు.

దేశ 60 శాతం వ్యాక్సిన్ అవసరాలను తీరుస్తూ.. అతిపెద్ద వ్యాక్సిన్ సరఫరాదారుగా ఉన్న భారత్ వైపు.. ప్రపంచ దేశాలు చూసేలా చేస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి వ్యాక్సినేషన్ అందించే.. ఓ బలమైన వ్యాక్సినేషన్ విధానాన్ని తీసుకురావాలని గవర్నర్ అన్నారు.

శనివారం హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్​లలో వ్యాక్సిన్ పరిశోధనా కేంద్రాలను ప్రధాని సందర్శించటం ద్వారా.. అవిశ్రాంతంగా కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు శ్రమిస్తోన్న శాస్త్రవేత్తలకు ప్రోత్సాహాన్నివ్వటంతోపాటు.. ఒక బలమైన వ్యాక్సిన్​ను తీసుకువచ్చేలా వారిని ప్రేరేపిస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి : నియ‌మావ‌ళి ఉల్లంఘించిన 14 మందిపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.