ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(world environment day) పురస్కరించుకొని ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్(green india challenge)లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) దంపతులు రాజ్‌భవన్‌లో మొక్కలు నాటారు. సందర్భం ఏదైనా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని… పర్యావరణ రక్షణ బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు సంతోశ్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటిన గవర్నర్… ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎంపీ సంతోశ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు కొనసాగాలని… అందుకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ సందర్భంగా పాండిచ్చేరి రాజ్‌భవన్‌లో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్(green india challenge) కార్యక్రమం చేపట్టేందుకు ఎంపీ సంతోశ్‌ను గవర్నర్ ఆహ్వానించారు.
ఇదీ చూడండి: Harish rao: 'ప్రాణమున్నంత వరకు కేసీఆర్ మాట జవదాటను'