Tamilsai Responding to KCR Comments: ఖమ్మం బీఆర్ఎస్ సభలో గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన విమర్శలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఖండించారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ స్థానానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని తమిళిసై అన్నారు. రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవిని ముఖ్యమంత్రులు ఎలా నిర్లక్ష్యం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం రాలేదని చెప్పారు.
ఇది ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్తానన్నారు. పరీక్షల భయాన్ని జయించే అంశంపై ప్రధాని నరేంద్రమోదీ రాసిన 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకాన్ని గవర్నర్ రాజ్ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమిళిసై ప్రోటోకాల్ వివాదాన్ని ప్రస్తావించారు.
గవర్నర్లు వారి విధులను నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తెలంగాణలో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఏకపక్ష వైఖరి కనిపిస్తోందని నేను చెప్పగలను. ఇది నేను బహిరంగంగానే చెబుతున్నాను. నేను నా విధిని మాత్రమే నిర్వహిస్తున్నాను. ఏ విషయంలో విబేధించడం లేదు. కొన్ని బిల్లులు ఉన్నాయి. నేను అంగీకరిస్తాను. కానీ వాటిని విశ్లేషించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోగలనని నేను ఇప్పటికే చెప్పాను. నా తప్పు లేనప్పటికీ ఇక్కడ ప్రోటోకాల్ లేదు. రాజకీయ నేతలు.. ప్రధానంగా ముఖ్యమంత్రులు గవర్నర్లను నిందిస్తున్నారంటే వారి ప్రభుత్వ వైఖరిని.. అదీ తెలంగాణలో ఎలా అర్థం చేసుకోవాలి. ఎక్కడా ప్రోటోకాల్ అనుసరించరు. ఇప్పటివరకు గణతంత్ర దినోత్సవాలపై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఒక్కటే ప్రశ్న నేను మళ్లీ మళ్లీ అడుగుతున్నాను. ప్రోటోకాల్ ఎందుకు అనుసరించరు. ఇది ప్రామాణికమైనది కదా. ఇందుకు వాళ్లు మొదట సమాధానం చెప్పాలి. -తమిళి సై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్
నిన్న ఖమ్మం బహిరంగ సభలో కేజ్రీవాల్ గవర్నర్లు సీఎంలను ఇబ్బందులు పెడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లని ప్రధాని మోదీ ఆడిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్లపై దిల్లీ నుంచి ఒత్తిడి ఉందన్నారు. సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారని.. వచ్చే ఎన్నికలు దేశాన్ని మార్చేందుకు ప్రజలకు మంచి అవకాశమని కేజ్రీవాల్ తెలిపారు.
ఇవీ చదవండి: