సూర్యాపేటలో కబడ్డీ క్రీడల ప్రమాదం పట్ల గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ ఆదేశించారు. ప్రమాదంలో చాలామంది గాయపడడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత కథనం చూడండి : కబడ్డీ పోటీల్లో అపశ్రుతి.. 150 నుంచి 200 మంది వరకు గాయాలు