అవయవ మార్పిడి చట్టం అమలు చేయడంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ ఎంకే.మణి ముఖ్య పాత్ర పోషించారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆయన నెఫ్రాలజీ పితామహుడని ఆమె కొనియాడారు. హైదరాబాద్ బంజారహిల్స్ స్టార్ ఆసుపత్రిలో వార్షిక కిడ్నీ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికీ ఆయన ఎంతోమంది నెఫ్రాలజిస్టులకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లుగా వార్షిక కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు స్టార్ ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి