Governor on Crimes: రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక కోరారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై ఆమె ఆరా తీస్తున్నారు. ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య ఘటనపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు.
కామారెడ్డి జిల్లాలో రామాయంపేటలో తల్లీకుమారుడి ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక అడిగారు. భువనగిరి పరువు హత్య, సూర్యాపేట జిల్లాలో సామూహిక అత్యాచార ఘటనపై కూడా పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మీడియాలో వచ్చిన వార్తలు, భాజపా రాష్ట్ర శాఖ వినతి ఆధారంగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
పీజీ వైద్యవిద్య సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకర్లైన అర్హులకు సీట్లను నిరాకరించారన్న వార్తలను సీరియస్‌గా తీసుకున్నారు. ఈ పరిణామాలపై తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిని గవర్నర్ ఆదేశించారు.
ఇవీ చూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం