దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో భారత పోలీస్ బ్యాండ్ పోటీలను నిర్వహించనుంది. ఈ పోటీలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించనున్నారు. గతంలో 2009లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, పారామిలటరీ దళాల నుంచి దాదాపు 1,450 మంది సభ్యులు ఈ పోటీలో పాల్గోనున్నారు.
బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగల్ కాల్ఫ్ అను మూడు ప్రత్యేక విభాగాల్లో పోటీలు నిర్వహించి పతకాలు అందజేస్తారు. ఈ పోటీల సందర్భంగా నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్ వంటి ప్రదేశాల్లో బ్యాండ్ ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రజలకు వినోదాన్ని అందిస్తామని ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి : జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!