స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని... అందుకు పురుషులు స్త్రీలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ కోఠి మహిళా కళాశాల 15వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అమ్మాయిలు ఏది అనుకుంటే అది సాధిస్తారని... తాను కూడా విద్యార్థినిగా ఉన్నపుడు అన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు.
ప్రతి మనిషికి విద్య నూతన జ్ఞానాన్ని, సాధికారతను ఇస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థినులకు తమిళిసై పట్టాలను అందజేశారు. ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అరవింద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అధికారుల భద్రతపై దృష్టి సారించండి: సోమేశ్‌కుమార్