ETV Bharat / state

Governor Ordered Report On IIIT Students Suicides : 'ఐఐఐటీ విద్యార్థుల మరణాలపై.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి'

Basara IIIT Students Dies By Suicides : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మరణాలపై గవర్నర్ తమిళిసై.. 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉపకులపతికి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల మరణాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

Governor tamilisi
Governor tamilisi
author img

By

Published : Jun 16, 2023, 3:40 PM IST

Governor Sought Report On The Suicides Of Basara IIIT Students : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తీవ్ర చర్యలకు దారితీసిన, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని ఉపకులపతిని ఆదేశించారు. ఈ విషయంపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్​లో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న చర్యలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులు తీవ్ర చర్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉన్నత విద్య అభ్యసించి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు.

అసలేం జరిగింది : నిర్మల్​లోని బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థుల వరుస మరణాలు.. అందరినీ కలవరం పెడుతున్నాయి. మూడు రోజుల క్రితం దీపిక అనే విద్యార్థిని చున్నీతో బాత్​రూంలో ఉరివేసుకున్న మరణవార్త మరువక ముందే.. జూన్​ 14న లిఖిత అనే విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకు పోలీసులు.. ప్రమాదమా? లేక ఆత్మహత్యనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Basara IIIT Students Committed Suicides On campus : బాసరలోని రాజీవ్​గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు చెందిన లిఖిత(17) పీయూసీ ప్రథమ సంవత్సరం.. వసతి గృహంలో ఉంటూ చదువుతుంది. వారం రోజుల క్రితమే తను ఇంటి నుంచి హాస్టల్​కు వెళ్లింది. ఇంతలోనే జూన్​ 14వ తేదీన అర్ధరాత్రి 2 గంటల సమయంలో నాలుగో అంతస్తు నుంచి కిందపడింది. ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది.. క్యాంపస్ హెల్త్​ సెంటర్​లో విద్యార్థినికి ప్రథమ చికిత్సను అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నిర్మల్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు ఆత్మహత్యే అని భావించిన కుటుంబ సభ్యులు తర్వాత.. అది ప్రమాదమని గట్టిగా నొక్కిచెప్పారు. విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు వారికి మద్దతు తెలిపాయి.

కాంగ్రెస్​, బీజేపీ ఆందోళన : బాసరలో కొనసాగుతున్న మరణాల పట్ల కాంగ్రెస్, బీజేపీ వంటి రాజకీయ పార్టీలు మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు. ఈ మరణాలు ప్రభుత్వ హత్యలే అని కాంగ్రెస్​ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని.. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మరణాలపై వెంటనే జ్యూడీషియల్ విచారణ జరిపించాలని.. వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.