గవర్నర్ నరసింహన్ ఇవాళ విజయవాడ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ పయనమవుతారు. ప్రమాణ స్వీకారోత్సవం పూర్తైన తర్వాత మధ్యాహ్నం గవర్నర్, కేసీఆర్, జగన్ ముగ్గురూ కలిసి దిల్లీ వెళ్తారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్