హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో సౌత్ ఇండియా జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రధాన డిమాండ్‌ను ఆర్టీసీ జేఏసీ వెనక్కి తీసుకున్నందున ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపాలని కోరారు.
ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవాలని హైకోర్టు సైతం తెలిపిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించని పక్షంలో ప్రజా ఉద్యమంగా మారే ప్రమాదముందని అన్నారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మె: పట్టు వీడ లేదు.. మెట్టు దిగ లేదు..?