ETV Bharat / state

ప్రాణవాయువు.. రాష్ట్రంలో స్వయం సమృద్ధం ఎన్నడు? - హైదరాబాద్​ వార్తలు

దక్షిణాదిలో వైద్య సౌకర్యాలకు ప్రధాన కేంద్రంగా పేరొందిన నగరం హైదరాబాద్‌. మెడికల్‌ టూరిజంగా కూడా ప్రసిద్ధిగాంచుతోంది. దేశవిదేశాల నుంచి ఎంతోమంది వైద్యపరమైన అవసరాల కోసం ఇక్కడకు వస్తుంటారు. నిపుణులైన వైద్యులు, అధునాతన సాంకేతిక సౌకర్యాలు.. చౌకలో అందే వైద్య సదుపాయాలు వారిని ఆకర్షిస్తున్నాయి. కరోనాకు చికిత్స కోసం కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎంతోమంది తరలివస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితుల్లో 30 శాతం వరకు ఇతర రాష్ట్రాలవారే ఉన్నట్లు అంచనా. ఇంత ఘనమైన చరిత్ర ఉన్న నగరం రోగులకు ప్రాణాధారమైన ఆక్సిజన్‌ కోసం మాత్రం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రాణవాయువుకు కొరత లేకున్నా స్వయం సమృద్ధం కావడంపై ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

government-should-focus-on-becoming-self-sufficient-despite-the-shortage-of-oxygen-in-telangana
ప్రాణవాయువు.. రాష్ట్రంలో స్వయం సమృద్ధం ఎన్నడు?
author img

By

Published : Apr 29, 2021, 8:50 AM IST

కరోనా రెండోదశ తీవ్రస్థాయిలో ప్రబలుతుండటంతో ఇప్పటికే ఆక్సిజన్‌కు డిమాండ్‌ దాదాపు రెండింతలైంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగితే దీని అవసరం మరింత పెరుగుతుంది. రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు పరిశ్రమలు పెద్ద మొత్తంలో ఆమ్లజనిని ఉత్పత్తి చేస్తాయి. చిన్న చిన్న మొత్తాల్లో తయారు చేసే పరిశ్రమలు కూడా ఎక్కువే ఉన్నాయి. వీటన్నింటినీ కలిపినా 120 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దాదాపు 350 టన్నుల ప్రాణవాయువు అవసరమని అంచనా. దీంతో మిగతా మొత్తం కోసం ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 5 ప్లాంట్లను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. ఈ వారాంతానికి వాటిలో 3 అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఆపత్కాల ఏర్పాట్లే.

నిల్వలకు భారీగా ఏర్పాట్లు

రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్లు గత వారం నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాయి. సాధారణ రోజుల్లో 60 నుంచి 75 టన్నులు ఉత్పత్తి అయితే.. 50 టన్నుల వరకు డిమాండ్‌ ఉండేది. కరోనా తొలిదశలో రోజుకు 65 నుంచి 70 టన్నుల వరకు ఆక్సిజన్‌ అవసరం ఏర్పడిందని ఉత్పత్తిదారులు తెలిపారు. ఇప్పుడు 350 టన్నుల వరకు డిమాండ్‌ ఉంటుందని అంచనా. నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం తదితర ప్రధాన ఆసుపత్రుల్లో ప్రభుత్వం భారీగా ఆక్సిజన్‌ నిల్వలకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని అన్ని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలల్లోనూ నిల్వ సదుపాయాలు ఉన్నాయి కాని ఉత్పత్తి ప్లాంట్లు లేవు. తాజాగా హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌లోని ఒక్కో ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్‌ ప్లాంట్లను కేంద్రం సమకూర్చింది.

కేరళ విధానం అనుసరణీయం

కరోనా తొలిదశలో కేరళ ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంది. భవిష్యత్తు ఉపద్రవాలపై అప్రమత్తమైన ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేటు రంగంలో ప్రాణవాయువు ఉత్పత్తికి ఏర్పాట్లు చేసింది. ఆ రాష్ట్రానికి రోజువారీగా 110 నుంచి 120 టన్నులకు మించి అవసరం లేదు. అయినా ఈ ఏడాది కాలంలో సుమారు 58 శాతం ఉత్పత్తిని పెంచుకుని మిగులు నిల్వలతో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రోజుకు 204 టన్నులు ఉత్పత్తి చేస్తోంది. సొంత అవసరాలు పోను కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటం విశేషం.

మదురై ఎంపీ ముందుచూపు

తమిళనాడు రాష్ట్రంలోని మదురై లోక్‌సభ సభ్యుడు ఎస్‌.వెంకటేశన్‌ ముందుచూపుతో ఓ ఆసుపత్రిని ఆక్సిజన్‌ కొరత లేకుండా తయారుచేశారు. మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో 6,000 లీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యం ఉన్న ట్యాంకు ఉంది. అది 400 పడకలకు మాత్రమే సరిపోయేది. కరోనా తొలిదశలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయన నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేసి సఫలమయ్యారు. ప్రస్తుతం 20,000 లీటర్ల నిల్వకు సామర్థ్యం పెంచటంతో 1,100 పడకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్‌ అందజేస్తున్నారు.

ఇదీ చూడండి: నగరంలో కష్టంగా మారుతున్న కరోనా మృతుల అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.