ETV Bharat / state

హైదరాబాద్ వాసులకు గుడ్​న్యూస్.. రద్దీ తగ్గించేందుకు లింకు రోడ్లు - Establishment of link roads

Hyderabad Road Development Corporation Limited: జీహెచ్​ఎం​సీ అభివృద్ధితోపాటు శివారు మున్సిపాలిటీల అనుసంధానానికి, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో.. స్పెషల్ పర్పస్ వెహికల్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో మిస్సింగ్ లింక్ కారిడార్లు, స్లిప్ రోడ్లను గుర్తించి అభివృద్ధి చేయాలని, అధికారులను సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతోపాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ప్రత్యామ్నాయ మార్గాలుగా లింక్ రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

Hyderabad Road Development Corporation Limited

author img

By

Published : Nov 16, 2022, 9:07 AM IST

ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.. లింక్‌రోడ్ల ఏర్పాటు..!

Hyderabad Road Development Corporation Limited: జీహెచ్​ఎమ్​సీ పరిధిలోని ప్రాంతాల మధ్యదూరం తగ్గించేందుకు, ప్రభుత్వం లింక్‌, స్లిప్‌ రోడ్లను నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా.. ఆయా ప్రాంతాల ప్రజలకు సులభతర రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ప్రధాన కారిడార్‌లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లింక్ రోడ్ల ఉద్దేశం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, మొత్తం 126.20 కిలోమీటర్ల పొడవు కలిగిన 135 లింక్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

అందులో భాగంగా, దాదాపు 572 కోట్లతో 52.36 కిలోమీటర్ల లింక్‌ రోడ్ల నిర్మాణాలు చేపట్టగా, 273 కోట్ల విలువైన 24 కిలోమీటర్ల పొడవైన పనులు పూర్తిచేశారు. అవి ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 28.36 కిలోమీటర్ల, 298 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. పూర్తైన లింక్ రోడ్ల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మరో 104 రోడ్లునిర్మించాలని సర్కారు భావిస్తోంది.

జీహెచ్​ఎం​సీతోపాటు చుట్టుపక్కల 10 మున్సిపాలిటీల్లోని ప్రాంతాల అనుసంధానం చేసేందుకు, 2వేల 410 కోట్ల అంచనాతో 104 లింక్ రోడ్లను మంజూరు చేసింది. ప్రభుత్వం జీహెచ్​ఎమ్​సీలో 11వందల 60 కోట్లతో 95.47 కిలోమీటర్లు, 10 మున్సిపాలిటీల్లో 12వందల 50 కోట్లతో 103.45 కిలోమీటర్ల లింక్ రహదారులనిర్మాణం చేపట్టింది.

బండ్లగూడ జాగీర్, ఘట్‌కేసర్‌, కొత్తూరు, దమ్మాయిగూడ, నాగారంతోపాటు.. బడంగ్‌పేట్‌, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మణికొండ, జవహార్‌నగర్ కార్పొరేషన్‌లో లింక్ రోడ్లు నిర్మాణం చేపట్టింది. 12.66 కిలోమీటర్లు పొడవైన 11 ఇతర మిస్సింగ్ లింక్ కారిడార్లను మొత్తం 108.93 కోట్లతో హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.