ETV Bharat / state

ఇకపై ఆన్​లైన్​లో ఆర్జిత సేవలు - t app folia

యాప్​​ ద్వారా కోరుకున్న దేవాలయాల్లో పూజలు నిర్వహించేలా తెలంగాణ ఐటీ శాఖ వెసులుబాటు కల్పిస్తోంది. యాప్​ డౌన్​లోడ్​ చేసుకున్న వాళ్లు ఆర్జిత సేవను ఓపెన్​ చోసి వివరాలు నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు.

government give chance online arjita sevalu devotees
ఇకపై ఆన్​లైన్​లో ఆర్జిత సేవలు
author img

By

Published : Apr 8, 2020, 3:10 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఆలయాలకు వెళ్లలేకపోతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఐటీశాఖ రూపొందించిన ఓ యాప్​ ద్వారా మీకు ఇష్టమైన ఆలయాల్లో పూజలు చేయించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లేస్టోర్‌లో టీ యాప్​ ఫోలియోను రూపొందించారు. మొదటగా ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్​లోని ఉజ్జయినీ మహంకాళీ దేవాలయం, కర్మాన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయంలో ఆన్​లైన్​ సేవలను ప్రారంభించినట్లు కర్మాన్‌ఘాట్ దేవాలయం ఈవో అన్నపూర్ణ తెలిపారు.

గూగుల్‌ ప్లేస్టోర్​ నుంచి యాప్‌ను డౌన్​లోడ్ చేసుకుంటే అందులో దేవాలయాల వివరాలు ఉంటాయని ఆమె తెలిపారు. కావాల్సిన ఆలయాల్లో ఆర్జిత సేవను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. దీని ఆధారంగా ఆయా దేవాలయాల్లో భక్తుల పేర్లతో వారు కోరుకున్న రోజున పూజలు నిర్వహిస్తామని అన్నపూర్ణ వివరించారు. ఆ వివరాలను తిరిగి వారి మొబైల్​కు సమాచార రూపంలో అందిస్తామన్నారు.

ఇవీ చూడండి: కరోనా కాలం.. నయా పంథాలో సైబర్​ నేరగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.