ETV Bharat / state

విదేశాల నుంచి తగ్గిన ఎరువుల దిగుమతులు

ఈ వానాకాలం సీజన్‌లో కోటీ 35 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నెలలో వర్షాలు మొదలైతే అన్ని రాష్ట్రాల నుంచి ఎరువులకు గిరాకీ పెరుగుతుంది. ఈనెలలోనే గరిష్ఠంగా నిల్వలు పెట్టాలని వ్యవసాయశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

author img

By

Published : May 13, 2020, 11:22 AM IST

government focus on urea
విదేశాల నుంచి తగ్గిన ఎరువుల దిగుమతులు

తెలంగాణలో ఈ వానాకాలం సీజన్‌లో కోటీ 35 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 14 లక్షల టన్నుల యూరియా కావాలని గత మార్చిలో తొలుత కేంద్రాన్ని కోరింది. గత ఐదేళ్ల వానాకాల సీజన్‌ సగటు ప్రకారం తెలంగాణలో యూరియా వినియోగం 9 లక్షల టన్నులే కాగా.. ఈ సీజన్‌లో 10 లక్షల టన్నులు కేటాయించింది. అత్యవసరమైతే మరో 50 వేల టన్నులిస్తామని తెలిపింది.

ఇప్పటివరకూ 25 వేల టన్నులే...

ఈ 10.50 లక్షల టన్నుల యూరియాలో గత నెలలో 1.06 లక్షల టన్నులు రావాలి. 37 వేల టన్నులు తక్కువగా పంపారు. ఈ నెల కోటా లక్షా 62 వేల టన్నుల్లో ఇప్పటివరకూ 25 వేల టన్నులే వచ్చింది. లాక్‌డౌన్‌ వల్ల కూలీల కొరత, దిగుమతులు రాకపోవడం వల్లనే సకాలంలో పంపలేకపోతున్నట్లు పలు కంపెనీలు వ్యవసాయశాఖకు తెలిపాయి. వచ్చే నెలలో వర్షాలు మొదలైతే అన్ని రాష్ట్రాల నుంచి ఎరువులకు గిరాకీ పెరుగుతుంది.

ఈనెలలోనే గరిష్ఠంగా నిల్వలు పెట్టాలని వ్యవసాయశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చేనెల ఆఖరునాటికి రాష్ట్ర పంటల సాగు అవసరాలకు మొత్తం 10 లక్షల టన్నులు కావాలని అంచనా. ఇప్పటికే 6.50 లక్షల టన్నులు గోదాముల్లో ఉన్నాయి. మిగిలినవి కూడా త్వరగా పంపాలని కంపెనీలను కోరింది.

సకాలంలో రాకుంటే ఇబ్బందులే...

జూన్‌లోగా మిగిలిన 3.50 లక్షల టన్నుల రాకపోతే జులైలో మరింత ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే రాష్ట్రానికి కేటాయించిన మొత్తం అన్ని రకాల ఎరువుల్లో అత్యధికంగా జులై నెలలోనే 7.39 లక్షల టన్నులు పంపుతామని కేంద్రం తెలిపింది. ఏప్రిల్‌, మే, జూన్‌ వరకూ రావాల్సిన వాటిలోనే లోటు ఏర్పడితే జులైలో అదనంగా కంపెనీల నుంచి తెప్పించడానికి ఇతర రాష్ట్రాల నుంచి పోటీ ఎక్కువ అవుతుందని అంచనా.

కొరత ఏర్పడితే..

మరోపక్క ఎరువుల కొరత ఏర్పడితే అత్యవసరంగా సరఫరాకు ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’(మార్క్‌ఫెడ్‌)ను 4 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటి కొనుగోలుకు రూ.500 కోట్లు రుణం తీసుకోవడానికి పూచీకత్తునిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో వరిధాన్యం, బియ్యం, మొక్కజొన్నలు వంటి పంటలను ప్రభుత్వం నేరుగా కొని నిల్వలు పెట్టడంతో గోదాములన్నీ నిండిపోయాయి. ఎరువుల నిల్వకు గోదాముల కొరత కూడా ఏర్పడింది. అవసరమైతే ఎక్కడికక్కడ ఫంక్షన్‌హాళ్లను ఇందుకు వినియోగించుకోవాలని నిర్ణయించారు.

ఇవీ చూడండి: గుప్పెడంత బియ్యం.. బోలెడంత సాయం.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.