ETV Bharat / state

టీఎస్ బీపాస్ అమల్లో నిర్లక్ష్యం.. అధికారులకు జరిమానా.. - TS BPass Latest News

Telangana Government: టీఎస్ బీపాస్ అమల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు ప్రభుత్వం జరిమానా విధించింది. వీరిలో ఆరుగురు హెచ్ఎండీఏ అధికారులు.. ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులు ఉన్నారు. గడువులోగా టీఎస్ బీపాస్ ప్రక్రియ పూర్తి చేయనందుకు ఈ జరిమానా వేసింది.

Telangana government
Telangana government
author img

By

Published : Oct 14, 2022, 8:02 PM IST

Updated : Oct 14, 2022, 8:09 PM IST

Telangana Government: భవన నిర్మాణ అనుమతుల కోసం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ అమల్లో అలక్ష్యం వహించిన మరో 39 మంది అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించింది. ఇందులో ఆరుగురు హెచ్ఎండీఏ అధికారులు.. ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులు ఉన్నారు. టీఎస్ బీపాస్ దరఖాస్తుల పరిశీలన.. పరిష్కారంలో కొంత మంది అధికారులు తీవ్ర జాప్యం కనబరుస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు పేర్కొంది.

చట్టం స్ఫూర్తిని కొనసాగించేందుకు వీలుగా అమల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు ప్రభుత్వం జరిమానా విధించింది. హెచ్ఎండీఏలో పనిచేసే ఆరుగురు అధికారులకు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జిల్లాల్లో మరో 33 మంది అధికారులకు జరిమానా విధించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు, 27 మంది స్క్రూటినీ అధికారులకు జరిమానా విధించాలని స్పష్టం చేసింది. 2020లో టీఎస్ బీపాస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆరు దఫాల్లో 56 మంది అధికారులకు జరిమానా విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. టీఎస్ బీపాస్ అమలు ప్రక్రియను తరచూ సమీక్షించాలని.. జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

ఇవీ చదవండి: భాజపాలో బూర నర్సయ్య గౌడ్ చేరికపై ఊహాగానాలు.. సమాచారం లేదన్న తరుణ్​ చుగ్

హిమాచల్ ప్రదేశ్​ ఎన్నికల తేదీ ప్రకటన.. గుజరాత్​ విషయంలో ఈసీ ట్విస్ట్

Last Updated : Oct 14, 2022, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.