జర్నలిస్టు హెల్త్ స్కీమ్‌లో అవకతవకలు జరిగాయని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఆరోపించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని వెల్నెస్ సెంటర్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లలో మందుల కొరత ఉందని తెలిపారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో గడువు ముగిసిన మందులే ఉన్నట్లు వారు గుర్తించారు.
ఇదీ చూడండి: 'ఆస్తులపై ఉన్న శ్రద్ధ... ప్రజల హక్కులపై లేదు'