ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగినే లంచమడిగిన మరో ప్రభుత్వ ఉద్యోగి - bribe latest news

ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన మరో ప్రభుత్వ ఉద్యోగిని అనిశా అధికారులు అరెస్టు చేశారు. నారాయణగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది.

government employee ask bribe to pass the bill at narayanaguda
ప్రభుత్వ ఉద్యోగినే లంచమడిగిన మరో ప్రభుత్వ ఉద్యోగి
author img

By

Published : Mar 8, 2020, 11:17 AM IST

హైదరాబాద్ నారాయణగూడ విఠల్ వాడి ప్రాంతానికి చెందిన కొనుగంటి కృష్ణ సర్వే అండ్ ల్యాండ్​లో డిప్యూటీ ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు గతంలో పెండింగ్​లో ఉన్న జీతం కోసం అబిడ్స్ బొగ్గులకుంటలోని భీమా భవన్​లోని పే అండ్ అకౌంట్స్ సూపరింటెండెంట్ తోట రామారావుకు అర్జీ పెట్టుకున్నాడు.

ఈ బిల్లును పాస్ చేసేందుకు గత నెల 18న ఆడిటర్ గోపీనాథ్​తో ఫోన్ చేయించి... ఐదు వేలు లంచం ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కృష్ణ అనిశా అధికారులను ఆశ్రయించారు. ఫోన్ రికార్డింగ్ ఆధారంగా రామారావును విచారించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ అచేశ్వర్ రావు తెలిపారు. గోపీనాథ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇవీచూడండి: మాస్కులు, సానిటైజర్లపై అధిక ధర వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.