ETV Bharat / state

నాలాల సమస్యను పరిష్కరించాలని సర్కారు నిర్ణయం - హైదరాబాద్ నాలాల సమస్య న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లోని నాలల సమస్యను పరిష్కరించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పరిపాలన అనుమతులు జారీ చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది.

నాలాల సమస్యను పరిష్కరించాలని సర్కారు నిర్ణయం

author img

By

Published : Oct 1, 2020, 9:29 AM IST

గ్రేటర్ హైదరాబాద్ లో నాలాల స‌మ‌స్యల‌ను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 298. 34 కోట్లతో 472 డ్రెయిన్ వ‌ర్క్స్ కు ప‌రిపాల‌న అనుమ‌తులు మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సిటీలో ప్రమాదకరంగా ఉన్న ఓపెన్ నాలాలకు పైకప్పులు వేయడం, రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

గ్రేటర్ లోని ఆరు జోన్లలో 2 మీటర్లకన్న తక్కువ వెడల్పు ఉన్న నాలాలకు సంబంధించి 382 పనులకు రూ. 233 కోట్లు, 2 మీటర్లకన్న ఎక్కువ వెడల్పు ఉన్న నాలాల్లో 90 పనులకు రూ. 65.32 కోట్లు మంజూరు చేశారు. ఎల్బీనగర్ జోన్ అత్యధికంగా 137 ప్రాంతాల్లో నాలాల అభివృద్ధికి రూ. 86.87 కోట్లు, చార్మినార్ జోన్ పరిధిలో 47 పనుల కోసం రూ. 32.59 కోట్లు వెచ్చించింది.

ఖైరతాబాద్ జోన్ పరిధిలో 44 పనులకోసం రూ. 33.06 కోట్లు, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 89 పనులకు రూ. 38.94 కోట్లు, కూకట్ పల్లి జోన్ లో 121 పనులకు రూ. 85.96 కోట్లు, సికింద్రాబాద్ జోన్ పరిధిలో 34 పనుల కోసం రూ. 29.92 కోట్లు రూపాయలు మంజూరు చేసింది.

ఇదీ చూడండి: భారత్​-చైనా దౌత్యస్థాయి చర్చలు.. సానుకూలమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.