ఈనెల 28వ తేదీన పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అలాగే ఆయన జౌన్నత్యం, పాలనా దక్షత, రాజనీతి, సేవలను అందరికీ తెలిసేలా చేసేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించబోతుంది. ఈ మేరకు గతేడాది నుంచి పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కె. కేశవరావు అధ్యక్షతన ఒక కమిటీని కూడా వేసింది. పీవీ నరసింహరావు మూర్తిమత్వాన్ని 360 డిగ్రీల్లో ఆవిష్కరించేలా ఆయనపై పముద్రించిన మొత్తం 8 పుస్తకాలను కమిటీ సంగ్రహించి ప్రచురించింది.
వీటితో పాటు.. పీవీ రాసిన ఇన్ఫ్ల్యూఎన్స్ ఆఫ్ ఇండియాస్ కల్చర్ ఆన్ ద వెస్ట్ అండ్ అదర్ స్పీచెస్. ద గ్రానీ అండ్ అదర్స్, ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అండ్ అదర్ ఎస్సేస్ వంటి రచనలను కూడా శతజయంతి రోజున ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసింది. వీటిని ఈనెల 28న పీవీ జ్ఞాన భూమిలో జరిగే పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర గవర్నర్, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ గ్రంథాల ప్రచురణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాహిత్య అకాడమీకి అప్పగించింది.
ఇదీ చూడండి: నాకే పునుగులిస్తావా.. నీ అంతుచూస్తా..