కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి మృతి పట్ల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికీ, ఆయన స్వరాష్ట్రం కర్ణాటకకు తీరని లోటని గవర్నర్ అన్నారు. కొవిడ్ సమయంలో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇవీ చూడండి: కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత