ETV Bharat / state

కంటెయిన్మెంట్ క్లస్టర్​ ప్రాంతంగా చంద్రగిరినగర్ బస్తీ - chandragiri nagar as a cantonment cluster

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చంద్రగిరినగర్ బస్తీని ప్రభుత్వం కంటెయి​న్మెంట్ క్లస్టర్​గా గుర్తించింది. బస్తీలోకి రాకపోకలను నిషేధించారు.

కంటోన్మెంట్ క్లస్టర్​ ప్రాంతంగా చంద్రగిరినగర్ బస్తీ

author img

By

Published : Apr 10, 2020, 3:04 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చంద్రగిరినగర్ బస్తీని కంటెయిన్మెంట్ క్లస్టర్​గా ప్రభుత్వం గుర్తించింది. చంద్రగిరినగర్ ప్రాంతంలో ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా సోకడం వల్ల అందులో దిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తి ఇటీవలే మరణించాడు. ఈ ప్రాంతంలో పర్యటించిన అధికారులు చంద్రగిరినగర్ బస్తీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బస్తీలోకి రాకపోకలను నిషేధించారు. బారికేడ్లు వేసి బయట వ్యక్తులు రాకుండా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి మార్కెటింగ్ కమిటీ ద్వారా కూరగాయలను సరఫరా చేస్తామని, వీరికి నిత్యావసర సరుకులను అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. జీడిమెట్ల పరిధిలోని అపురూపకాలనీలో ఓ అపార్టుమెంట్​ను కూడా అధికారులు కరోనా ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు.

ఇదీ చదవండి:'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.