నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలు నిర్వహించుకోవడం మన సంస్కృతి కాదని... విదేశీ సంస్కృతి అని గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డిసెంబర్ 31న యువకులు ఈ వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు. ఏటా ఎంతో మంది యువకులు తాగిన మత్తులో ఆక్సిడెంట్లకు గురై మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాగి మృతి చెందడం కంటే ధర్మం కోసం, కనిపెంచిన తల్లిదండ్రుల కోసం ప్రాణ త్యాగం చేయడం ఎంతో మేలని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు తాగుబోతుల మధ్య ఘర్షణ... ఒకరికి గాయాలు