GORAS PARIWAR SUMMIT: గో ఆధారిత వ్యవసాయం, ఔషధాల ఉత్పత్తిని పెంపొందించడమే లక్ష్యంగా గోరస్ పరివార్ సమాఖ్య సంస్థ పని చేస్తోందని ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో గోరస్ పరివార్ సంస్థ మొదటి సమ్మేళనాన్ని సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఘనంగా జరుపుకున్నారు. త్వరలోనే 12 రాష్ట్రాలలో ఈ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పీజీ విద్యార్థుల కోసం గోఆధారిత వ్యవసాయంలో నూతన విధానాల అమలు అంశాన్ని సిలబస్లో పొందుపర్చే విధంగా పలు ప్రాంతాల నుంచి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనునట్లు శ్రీనివాస్ రావు తెలిపారు. త్వరలోనే పాఠ్య పుస్తకాలలో గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలకు చెందిన 14 మంది కమిటీ సభ్యులను ఈ సమ్మేళనాలకు ప్రాతినిధ్యం వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో పాఠ్య ప్రణాళిక రూపొందించడం ఓ పెద్ద ఉద్యమంగా మారనుందని వారన్నారు.
గో ఆధారిత వ్యవసాయం, ఔషధాల ఉత్పత్తి మూలంగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడని పేర్కొన్నారు. త్వరలోనే గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. గో ఆధారిత వ్యవసాయ వృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తున్నట్లు శ్రీనివాస్ రావు వెల్లడించారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఉత్పత్తులు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రిటైర్డ్ ఉస్మానియా ప్రొఫెసర్ మల్లికార్జునరావు తెలిపారు. ఇక్కడ యజ్ఞం ద్వారా గో ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: