హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్ పాల్గొన్నారు. మహిళలతో కలసి కాసేపు బతుకమ్మ ఆడారు. వేడుకల్లో కార్పొరేటర్లు భాగ్యలక్షి, ముఠా పద్మ, పలువురు జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండగ ప్రతీక అని, మహిళలంతా పండగను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె