భారతీయ రైల్వే శాఖ గతేడాదితో పోల్చితే... సరకు రవాణాలో అధిక లోడింగ్ చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నెల 11 నాటికి మొత్తం 11456.80 లక్షల టన్నులకు చేరుకుంది. గతేడాది ఇదే తేదీనాటికి మొత్తం లోడింగ్ 11456.10 లక్షల టన్నుల సరకు రవాణా జరిగింది.
నెలలవారీగా చూస్తే 2020 మార్చి 11న 393.30 లక్షల టన్నుల సరకు రవాణా జరగగా.. ఈ సారి 433.30 లక్షల టన్నులకు చేరింది. రోజువారీ గణాంకాల ప్రకారం గతేడాది ఇదే తేదీన 30.30 లక్షల టన్నులు.. కాగా ఈ ఏడాది ఒక్కరోజే 40.70 లక్షల టన్నుల సరకు రవాణా జరిగింది. ఇది గతేడాదితో పోలిస్తే 34శాతం అధికమని రైల్వే వర్గాలు వెల్లడించాయి. వేగం విషయానికొస్తే నిరుడు గంటకు 23.29 కి.మీ గూడ్స్ రైలు ప్రయాణిస్తే.. ఈ ఏడాది 45.49 కి.మీ ప్రయాణించిందని ఇది రెండింతల వేగమని రైల్వే శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్