ETV Bharat / state

అన్ని శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు: సీఎం కేసీఆర్

author img

By

Published : Jan 11, 2021, 5:13 PM IST

Updated : Jan 11, 2021, 8:09 PM IST

పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు తీపికబురు
పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు తీపికబురు

17:03 January 11

అన్ని శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు: సీఎం కేసీఆర్

ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాతే ఆయా శాఖల్లో ఏర్పడే ఖాళీలపై స్పష్టత వస్తుందన్నారు. జిల్లాల వారీగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. కారుణ్య నియామకాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసు నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. మూడేళ్లు కనీస సర్వీసు ఉండాలన్న నిబంధనను సడలిస్తూ రెండేళ్లకు కుదించింది. సంబంధిత దస్త్రంపై సీఎం కేసీఆర్ ఇవాళ సంతకం చేయగా... సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కుదింపు తక్షణమే అమల్లోకి వస్తుందని, 2021 ఆగష్టు నెలాఖరు వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

 ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారంలో భాగంగా ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉద్యోగసంఘాల ఐకాస అధ్యక్షుడు రాజేందర్, జనరల్ సెక్రటరీ మమత కృతజ్ఞతలు తెలిపారు.  

Last Updated : Jan 11, 2021, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.