మెట్రో రైలు ప్రయాణికులకు కేంద్రప్రభుత్వం తీపి కబురు తెలిపింది. వస్తువులు లేదా సామగ్రి బరువు పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 15 కిలోల వరకు లగేజ్ పరిమితి ఉండగా... ఇకపై ప్రయాణికులకు 25 కిలోల బరువున్న లగేజ్‌ను తీసుకువెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రయాణికులు అదనంగా మరో 10 కిలోల లగేజ్‌ను తీసుకెళ్లే వీలుందని మెట్రో అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి :ప్రజల్లో అభద్రతాభావం తొలగించేందుకే తనిఖీలు