సంప్రదాయ చీరకట్టు, లంగాఓణిలో సినీ తారలు జెన్నీ, కృత్య కర్థా మురిసిపోయారు. ఆన్‌లైన్ ఆభరణ విక్రయాల సంస్థ కొటారి జ్యూయలరీ ఈ నెల 31వ తేదీన బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నగల ప్రదర్శన నిర్వహించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వీరితో పాటు పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో భాగ్యనగరంలోని ఆభరణాల ప్రియులకు బంగారు, వజ్రాభరణాల్లోని సరికొత్త మోడల్స్‌ని పరిచయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: భారత జట్టు ఎంపికపై మాజీలు తలోమాట