తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వచ్చే వర్షాకాలంలోగా ఈవీఎం గోదాంల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల నిల్వ కోసం గోదాముల నిర్మాణ పురోగతిపై సీఎస్తో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం సలహాదారు భన్వర్ లాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. నారాయణపేట్, ములుగు జిల్లాలో గోదాంల నిర్మాణం కోసం అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు.
వచ్చే ఏడాది వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి అన్ని జిల్లాల్లో గోదాంల నిర్మాణం పూర్తి చేయాలని సీఈసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోనూ గోదాముల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : వర్షాభావంలో చిరుధాన్యాలే ప్రత్యామ్నాయం