నిన్నమొన్నటి నీలివర్ణంలో విశేషంగా ఆకర్షించిన గోదావరి... వర్షాకాలం వల్ల ఎరుపు రంగును సంతరించుకుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు.. వాగులు, వంకల్లోని నీరు గోదావరిలోకి చేరింది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.9 అడుగుల నీటిమట్టం ఉంది. డెల్టా కాల్వలకు11 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 10వేల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీచదవండి: ప్రస్తుత సమయంలో సముచిత నిర్ణయం: పవన్ కల్యాణ్