ETV Bharat / state

NON VEG: మేక/కోడి కోసిన 3 గంటల్లోనే వండేయాలి.. లేదంటే..! - మూడు గంటల్లోనే చికెన్​ వండేయాలి

'ఏపీ, తెలంగాణ నుంచి నాణ్యమైన, ఆరోగ్యకరమైన మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి ప్రజలకు ఆ స్థాయి మాంసాన్ని చిల్లర దుకాణాల్లో విక్రయించడం లేదు. తెలంగాణ ప్రజల్లో 90% మాంసాహారులని మా సర్వేలో తేలింది. అందువల్ల మాంసం విక్రయాల్లో పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలి'’ అని చెంగిచెర్లలోని జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం సంచాలకుడు (డైరెక్టర్‌) సుఖదేవ్‌ బర్బుద్దే చెప్పారు. మాంసాహారులపై, మాంసం విక్రయాలపై ఈ సంస్థ ఇటీవల అధ్యయనం చేసింది. మాంసం విక్రయదారులకు నాణ్యత ప్రమాణాలపై శిక్షణ ఇచ్చి వారికి అవసరమైన సామగ్రిని ఉచితంగా అందజేస్తోంది. ఈ సంస్థ కార్యకలాపాలు, మాంసం నాణ్యత, విక్రయాలపై ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

National Research Centre of Meat Director

author img

By

Published : Aug 26, 2021, 10:51 AM IST

National Research Centre of Meat Director
జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం సంచాలకుడు (డైరెక్టర్‌) సుఖదేవ్‌ బర్బుద్దే
  • తెలుగు రాష్ట్రాల్లో మాంసం వినియోగం ఎలా ఉంది?

రోజుకు తెలంగాణలో సగటున 50 వేల వరకూ గొర్రెలు, మేకలను విక్రయిస్తున్నట్లు అంచనా. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం గొర్రెలు, మేకల మాంసంలో 60% తెలుగు రాష్ట్రాల్లోనే కొంటున్నారు. గొర్రెలు, మేకలు, కోళ్లే కాకుండా, గేదెల్లాంటి ఇతర పశు మాంసంతో కలిపి చూసినా 5 రాష్ట్రాలే 50% పైగా మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అవి ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర.

  • తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు ఎందుకు పెరగట్లేదు?

గొర్రె లేదా మేక మాంసం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు 4.50 నుంచి 5 డాలర్లలోపే. హైదరాబాద్‌లో కిలోకు రూ.700-800 దాకా వసూలు చేస్తున్నారు. అంటే 10-11 డాలర్లుంది. ఇదే మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలంటే శుద్ధి, ప్యాకింగ్‌కు మరో 2 డాలర్ల వరకూ ఖర్చవుతుంది. అంటే సగటున కిలోకు 12-13 డాలర్లు వస్తేనే తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి సాధ్యం. అంత ధర లేనందున ఇక్కడి నుంచి ఎగుమతులు పెరగడం లేదు.

  • విదేశాల నుంచి దిగుమతులు ఎందుకు లేవు?

కేంద్రం విధించే సుంకాలు ఒక కారణం. దిగుమతులు పెరిగితే ఇక్కడ గొర్రె, మేకల పెంపకందారుల ఉపాధి పోతుందని ప్రభుత్వాలు కూడా అంతగా అనుమతించడం లేదు. ఇక్కడి ప్రజల మాంసాహార అలవాటు మరో కారణం. తెలుగు ప్రజల్లో ఎక్కువ మంది ఫ్రిజ్‌లో నిల్వ, ప్యాక్‌ చేసి ఉన్న మాంసం కొనడానికి ఇష్టపడరు. విదేశాల నుంచి ప్యాకింగ్‌లో వచ్చేవాటిని ఇక్కడ కొనరని వ్యాపారులు తెప్పించడం లేదు. నాణ్యంగా అమ్మడానికి మా సంస్థలో శిక్షణ ఇస్తున్నాం. కానీ శిక్షణ పొందినవారు కూడా ఫ్రిజ్‌లో ఉంచి అమ్మితే ప్రజలు కొనరని ఆ పద్ధతులు పాటించడం లేదు.

  • తెలంగాణలో గొర్రెల పంపిణీపై పరిశోధన చేశారా?

ఇది మంచి కార్యక్రమం. కానీ పంపిణీ చేసే గొర్రెలను ఎక్కడ కొంటున్నారో చూడాలి. ఒక ఏడాది లేదా రెండేళ్లలో అందరికీ గొర్రెలు పంపిణీ చేయడం సాధ్యం కాదు. దశలవారీగా ఐదారేళ్ల పాటు క్రమపద్ధతిలో పంపిణీచేస్తే అందరికీ అందుతాయి. ఒక్కొక్కరికి 20 గొర్రెలు ఇవ్వడం వల్ల వారి ఆదాయం పెద్దగా పెరగదు. అలా కాకుండా ఒక గ్రామంలో 30-40 మంది గొర్రెల కాపరులను సంఘంగా ఏర్పాటుచేసి వారికి సంయుక్తంగా గొర్రెలిచ్చి, పెంపకానికి అవసరమైన దాణా, మందులు, షెడ్లు ఇవ్వాలి. అమ్మేటప్పుడు సంఘం తరఫున టోకుగా అమ్ముకుంటారు. వారే సొంత బ్రాండుతో అమ్ముకుంటే రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. విడిగా అయితే వ్యాపారులు తక్కువ ధరకు కొని, లాభాలార్జిస్తున్నారు.

  • మాంసం కొనుగోలులో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

వాస్తవానికి గొర్రె, మేక లేదా కోడిని కోసినప్పటి నుంచి 3 గంటల్లోనే మాంసం వండాలి. అలా వండకపోతే 3 గంటల తరవాత బ్యాక్టీరియా పెరిగి కుళ్లడం ప్రారంభమవుతుంది. అలా వండకపోతే.. 0-4 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఫ్రిజ్‌లో భద్రపరచాలి. 24 గంటల తర్వాత అయితే మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. కానీ చాలా దుకాణాల్లో తెల్లవారుజామున కోసి పగలంతా అమ్ముతున్నారు. రోడ్డు పక్కనే మాంసాన్ని వేలాడదీసి అమ్మడం అనారోగ్యకరం. అవి తింటే అనారోగ్య సమస్యలొస్తాయి. ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకుని కొని వండుకోవాలి.

  • ప్రైవేటు పెట్టుబడులు ఎందుకు రావడం లేదు?

కోళ్ల పరిశ్రమ స్థాయిలో గొర్రెలు, మేకల పెంపకంలోకి ప్రైవేటు పెట్టుబడులు పెద్దగా రావడం లేదు. అవి వస్తేనే ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. కోళ్ల పరిశ్రమలో ప్రభుత్వ పెట్టుబడులు నామమాత్రమే. కానీ తెలుగు రాష్ట్రాలు మనదేశంలో గుడ్లు, కోడిమాంసం ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. గొర్రెలు, మేకల పెంపకంలోకి కూడా ప్రైవేటు పెట్టుబడులు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి కృషి చేయాలి. ప్రైవేటు పెట్టుబడిదారులకు మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గొర్రెల కాపరుల సంఘాలకే అలా ఇస్తే సమష్టిగా లాభాలార్జిస్తాయి. కనీసం 800-1000 గొర్రెలను ఒకచోట శాస్త్రీయ పద్ధతుల్లో పెంచితేనే లాభాలొస్తాయి. అప్పుడే మంచి ఆదాయం వస్తుందని మా అధ్యయనంలో తేలింది. 20-30 గొర్రెలను పెంచేవారికి పెద్దగా లాభాలు రావు.

ఇదీచూడండి: healthy food: ఇలా చేస్తే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.