పదో తరగతి విద్యార్థులందరినీ... పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎఫ్ఏ పరీక్షల మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఖరారు చేయనున్నట్లు జీవోలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ప్రకారం విద్యా శాఖ జీవో జారీ చేసింది. పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించడం వల్ల పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు.. ఇతర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల విషయంలో అనుసరించిన విధానాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్.. ఎఫ్ఏ పరీక్షలకు ఉన్న 20 శాతం మార్కులను.. వందశాతానికి లెక్కించి గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కులు మార్చి నెలలోనే పాఠశాలలు.. ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్లైన్లో పంపించినట్లు తెలిపింది. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగానికి అనుమతిస్తున్నట్లు జీవోలో పేర్కొంది. జీవో జారీ కావడం వల్ల పది రోజుల్లో ఫలితాలను ప్రకటించేందుకు ఎస్ఎస్సీ బోర్డు సన్నాహాలు చేస్తోంది.
ఇవీ చూడండి: పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు ప్రమోట్