GMR Prime Services: ‘జీఎంఆర్ ప్రైమ్’ పేరిట ఆతిథ్య సేవలు అందిస్తోంది. దీన్ని వినియోగించుకునేందుకు ప్రయాణికులు ముందుగా https://gmrprime.hyderabad.aero/departure-packages లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విమాన సర్వీసు, ప్రయాణించే శ్రేణి(క్లాస్)తో సంబంధం లేకుండా జీఎంఆర్‌ప్రైమ్‌లో సేవలు అందిస్తారు.
మొదటిసారిగా విమాన ప్రయాణం చేసే వారికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రత్యేకంగా సహాయకులను కేటాయించి ఎక్స్‌ప్రెస్ చెకిన్, ఫాస్ట్‌ట్రాక్ భద్రత తనిఖీలు, లగేజీ తదితర విషయాల్లో సహాయం అందిస్తారు. విశ్రాంతి సదుపాయం కల్పిస్తారు. ఎయిర్‌పోర్టులో క్యాబ్ దిగినప్పట్నుంచి విమానం ఎక్కే వరకు తోడుగా ఉండి మార్గనిర్దేశం చేస్తారు. వివిధ వర్గాల ప్రయాణికులకు ప్యాకేజీలను విమానాశ్రయం అందుబాటులోకి తీసుకువచ్చింది. విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రయాణికులే కాకుండా విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చేందుకు సర్వీసును వినియోగించుకునే వీలుంది. దీనివల్ల ప్రయాణికులు ఎలాంటి ఒత్తిడి పడకుండా రాకపోకలు సాగించవచ్చని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: cyber crime Hyderabad news today : ఇయర్‌ఫోన్స్ కొంటే.. రూ.33 లక్షలు దోచేశారు