ETV Bharat / state

Ghmc Mayor on BJP attack: అధిష్ఠానం ఆదేశాలతో విధ్వంసానికి దిగారా?: విజయలక్ష్మి - మేయర్ గద్వాల విజయలక్ష్మి

ఎవరి ఆదేశాలతో భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేశారని జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (ghmc mayor on bjp attack) ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్లే కౌన్సిల్ సమావేశం నిర్వహించలేకపోయామని ఆమె తెలిపారు. నగరంలో తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేశారని మేయర్ ఆరోపించారు.

Ghmc  Mayor on BJP attac
జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
author img

By

Published : Nov 23, 2021, 8:59 PM IST

ghmc mayor respond bjp attack: నగరంలో తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే భాజపా కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేశారని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు. జీహెచ్​ఎంసీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. భాజపా కార్పొరేటర్లు ప్రజల ఆస్తిని ధ్వంసం చేశారని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్లే కౌన్సిల్ సమావేశం నిర్వహించలేకపోయామని ఆమె తెలిపారు.

మేయర్ గద్వాల విజయలక్ష్మి

ఎవరి ఆదేశాలతో తన కార్యాలయంపై దాడి చేశారని కార్పొరేటర్లను మేయర్(ghmc mayor on bjp corporaters) ప్రశ్నించారు. భాజపా కార్పొరేటర్లు ఏ ప్రశ్న అడిగినా తాను సమాధానం ఇచ్చానని తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని డివిజన్లలో తాను పర్యటించానని వెల్లడించారు. కరోనా వల్ల వర్చువల్‌ సమావేశాలు నిర్వహించామని.. వారు తన వద్దకు వచ్చి ఏ సమస్య ఉన్నా అడగవచ్చని సూచించారు. నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే ఊరుకోమని విజయలక్ష్మి హెచ్చరించారు.

అది ప్రజల సొమ్ము

జీహెచ్​ఎంసీ కార్యాలయానికి వచ్చి కుర్చీలు (bjp attack on ghmc office)ధ్వంసం చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. జీహెచ్‌ఎంసీలోని వస్తువులు ప్రజల సొమ్ము అని తెలిపారు. భాజపా కార్యాలయం వద్ద ధర్నాకు తెరాస కార్పొరేటర్లు కూడా సిద్ధమయ్యారని వివరించారు. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతున్నందువల్లే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వచ్చి పనులు అడిగితే చేస్తున్నామని మేయర్ వెల్లడించారు. అధిష్ఠానం సూచన మేరకే భాజపా కార్పొరేటర్లు విధ్వంసానికి దిగారా(ghmc mayor on bjp) అని ప్రశ్నించారు. కుర్చీలు ధ్వంసం చేయడాన్ని భాజపా కార్పొరేటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ప్రజల సమస్యను తన దృష్టికి ఎప్పుడైనా తీసుకురావొచ్చని.. కౌన్సిల్‌ సమావేశంలోనే అడగాలనే నియమం లేదని సూచించారు.

అసలు ఊహించలేదు

బాధ్యాతయుతమైన పదవుల్లో ఉన్న కార్పొరేటర్లే ఇలా వ్యవహరిస్తారని అసలు ఊహించలేదన్నారు. మేయర్​గా తెరాస టికెట్​పై గెలిచినా అందరిని కలుపుకుపోయే బాధ్యత తనకు ఉందన్నారు. జీహెచ్ఎంసీలో(bjp corporaters on ghmc office) ప్రాధాన్యత క్రమంలోనే నిధులు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఒక కార్పొరేటర్​కు ఉండే కష్టాలు తనకు తెలుసని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​పై కూడా మేయర్ అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ సమావేశాలపై ఆయనకేం తెలుసని గద్వాల విజయలక్ష్మి(gadwala vijayalakshmi) ప్రశ్నించారు.

‘‘కౌన్సిల్‌ సమావేశం లేకపోయినా నా వద్దకు వచ్చి ఏదైనా అడగొచ్చు. కార్యాలయానికి వచ్చి కుర్చీలు ధ్వంసం చేయడం సరికాదు. జీహెచ్‌ఎంసీలోని వస్తువులు మేయర్ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. పార్టీలకు అతీతంగా వచ్చి పనులు అడిగితే చేస్తున్నాం. అధిష్ఠానం సూచన మేరకే భాజపా కార్పొరేటర్లు విధ్వంసానికి దిగారా? ఎవరి ఆదేశం మేరకు భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేశారు. భాజపా కార్యాలయం వద్ద ధర్నాకు తెరాస కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. కానీ, అది మా సంస్కారం కాదు. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీహెచ్‌ఎంసీకి 13 అవార్డులు వచ్చాయి. కార్పొరేటర్లకు క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలు నాకు తెలుసు. పార్టీలకు అతతీతంగా వచ్చి పనులు అడిగితే చేస్తున్నాం ’’

- గద్వాల విజయలక్ష్మి, జీహెచ్​ఎంసీ మేయర్

ఇదీ చూడండి:

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో భాజపా మెరుపు ధర్నా, మేయర్ ఛాంబర్​లో బీభత్సం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.