ETV Bharat / state

కరోనా అలర్ట్​: జీహెచ్​ఎంసీ హోం క్వారంటైన్​ ముద్రలు - GHMC Corona Home Quarantine

కరోనా విస్తరిస్తున్న తరుణంలో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. విదేశాల నుంచి భాగ్యనగరానికి వచ్చిన వారికి హోం క్వారంటైన్​ ముద్రలు వేస్తోంది. 14 రోజుల పాటు తప్పనిసరిగా 'హోం క్వారంటైన్'​లో ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

GHMC Home Quarantine
GHMC Home Quarantine
author img

By

Published : Mar 21, 2020, 11:41 PM IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్​ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తులను హోం క్వారంటైన్ చేస్తూ.. ముద్రలు వేయడం ప్రారంభించింది. ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఉపయోగించే ఇండెలిబుల్ ఇంకుతో రూపొందించిన స్టాంప్​ను చేతి మడమపై కనిపించేలా వేస్తున్నారు.

నగరానికి వచ్చినప్పటి నుంచి 14 రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్​లో ఉండాలని... అన్ని రోజులను లెక్కించి, స్టాంపులో తేదీని సరిచేసి ముద్ర వేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోనే 13 వేల మంది దాకా విదేశాల నుంచి వచ్చారని... వారందరి పాస్​పోర్ట్ అడ్రస్​లతో ఇళ్లకు వెళ్లి ముద్రలు వేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.

GHMC Home Quarantine
ఎడమ చేతిపై ముద్ర

ఇదీ చూడండి : 'జనతా కర్ఫ్యూను జయప్రదం చేద్దాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.