ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఉద్యోగులకు కరవు భత్యం - ghmc

జీహెచ్​ఎంసీ ఉద్యోగులకు కరవు భత్యం ఇవ్వాలని స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు, పొరుగు సేవలకు చెల్లించే వేతనాలకు సంబంధించిన తీర్మానాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

జీహెచ్​ఎంసీ ఉద్యోగులకు కరవు భత్యం
author img

By

Published : Jun 14, 2019, 11:23 AM IST

జీహెచ్​ఎంసీ ఉద్యోగులకు కరవు భత్యం

హైదరాబాద్​ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జీహెచ్ఎస్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి కమిషనర్ దానకిశోర్​తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 23 అంశాలను ఆమోదించారు.

తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఉత్తర‌-ద‌క్షిణ పంపిణీ విభాగాలు పెంచిన వేత‌న స‌వ‌ర‌ణ‌ల‌ను జీహెచ్ఎంసీలో డిప్యుటేష‌న్‌పై ప‌నిచేస్తున్న విద్యుత్ ఇంజ‌నీర్లకు వ‌ర్తింప‌జేయాలనే తీర్మానాన్ని ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన కరవు భత్యాన్ని జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వర్తించేయాలని ఆమోదించారు. ఎస్ఆర్​డీపీ పనుల నిధుల సేకరణకు మూడో విడతలో రూ. 305 కోట్లను బాండ్ల రూపంలో జూన్ లేదా జులై మాసంలో సేకరించేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

అద్దెకు మినీ టిప్పర్లు

న‌గ‌రంలోని చెరువుల్లో తేలియాడే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల‌ను తొల‌గించేందుకు ఆరు బ‌హుళ ఉప‌యోగ ఫ్లోటింగ్ ట్రాష్ క‌లెక్టర్లను రూ. 6.05 కోట్ల వ్యయంతో సేక‌రించేందుకు ఆమోదించారు. నిర్మాణ వ్యర్థాలు, చెత్తను సేకరించేందుకు మినీ టిప్పర్లను అద్దె ప్రాతిపదికపై తీసుకునే ప్రతిపాదనలతో పాటు మరో 18 తీర్మానాలకు జీహెచ్​ఎంసీ ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి : సర్కార్​ బడుల్లో చదువుల పండుగ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.