ETV Bharat / state

14 అంశాలతో ముసాయిదా బడ్జెట్​ ఆమోదం

2021- 22 ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్ మహానగర కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ముసాయిదా బడ్జెట్​ను ఆమోదించింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశమైంది.

14 అంశాలతో ముసాయిదా బడ్జెట్​ ఆమోదం
14 అంశాలతో ముసాయిదా బడ్జెట్​ ఆమోదం
author img

By

Published : Dec 17, 2020, 9:03 PM IST

హైదరాబాద్ మహానగర కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ 2021- 22 ఆర్థిక సంవత్సరానికి గాను 14 ఎజెండా అంశాలతో కూడిన ముసాయిదా బడ్జెట్​ను ఆమోదించింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశమైంది.

పెన్షనర్లకు 2019 జులై 1 నుంచి ప్రభుత్వం పెంచిన కరువు భత్యం అమలు, జీహెచ్ఎంసీలోని అధికారులందరికి అధికారిక వినియోగ నిమిత్తం ఒకే నెంబర్ గల పోస్ట్ పెయిడ్ 4జీ డేటా సిమ్​లను అందజేసే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నాగోల్​లోని ఫతుల్లగూడలో 6.20 ఎకరాల విస్తీర్ణంలో హిందు, ముస్లిం, క్రిస్టియన్​లకు ఒక్కో వర్గానికి రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే శ్మశానవాటికలలో హిందు కమ్యునిటీకి ఎలక్ట్రికల్ క్రిమిటోరియం, క్రిస్టియన్, ముస్లిం కమ్యునిటీలకు శ్మశానవాటికల నిర్మాణానికి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

ఆస్తుల సేకరణకు ఆమోదం...

సెయింట్ ఆన్స్ పాఠశాల నుంచి ఎన్​సీఎల్ ఎన్​క్లేవ్ వరకు 18 మీటర్ల విస్తీర్ణంలో రోడ్డు వెడల్పునకు గాను 15 ఆస్తుల సేకరణకు స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. గాజులరామారం నుంచి మోడి ఎన్ క్లేవ్ మీదుగా శ్రీవెంకటేశ్వర అసోసియేషన్ వరకు 18 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణకు 87 ఆస్తుల సేకరణకు అంగీకరించింది. తుకారం గేట్ గూడ్స్ ట్రాక్ నుంచి అడ్డగుడ్డ మీదుగా షహనాయ్ నర్సింగ్ హోం వరకు 18 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణ సందర్భంగా 210 ఆస్తుల సేకరణకు ఆమోదం తెలిపారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎన్​హెచ్​డీసీ నుంచి నార్సింగి నానక్ రాంగూడ సర్వీస్ రోడ్ వరకు 30 మీటర్ల రోడ్డు విస్తరణతో పాటు 15 ఆస్తుల సేకరణకు ఆమోదించారు. నాగోల్ నిస్సాన్ షోరూం నుంచి బండ్లగూడ వరకు జీహెచ్ఎంసీ పరిధి నుంచి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ తట్టి అన్నారం వరకు 36 మీటర్ల రోడ్డు విస్తరణ, 16 ఆస్తుల సేకరణకు ఆమోదం తెలిపారు.

రూ. 3.60 కోట్లతో...

నోవాటెల్ హోటల్ వెనుక భాగం జంక్షన్ నుంచి కూకట్​పల్లి ఫ్లైఓవర్, న్యాక్ నుంచి ఆర్​యూబీ హైటెక్ వరకు 30 మీటర్ల రోడ్డు విస్తరణ, ఐదు ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం తెలిపింది. కాప్రా సర్కిల్​లో మూడు స్టార్మ్ వాటర్ డ్రెయిన్​ల నిర్మాణానికి రూ.3.60 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచేందుకు ప్రతిపాదనలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.

ఇదీ చూడండి: పెళ్లైన 15 రోజులకే ఆత్మహత్యాయత్నం... వరుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.