ETV Bharat / state

'హైదరాబాద్​లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు' - ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

అగ్నికి ఆజ్యం పోసినట్లు కరోనా సమయంలో వర్షాలు వచ్చి నగరాన్ని అతలాకుతులం చేశాయని జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టామని వెల్లడించారు.

ghmc-special-sanitation-drive-in-hyderabad
'హైదరాబాద్​లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు'
author img

By

Published : Nov 6, 2020, 12:58 PM IST

వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్​ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మాసబ్ ట్యాంక్‌ విజయనగర్‌ కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు.

'హైదరాబాద్​లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు'

నగరవ్యాప్తంగా గత 15రోజుల్లో లక్ష టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించినట్లు చెప్పారు. ఇంకా 30వేల టన్నుల చెత్తను తొలగించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అంటువ్యాధుల సీజన్‌ అయినందున జీహెచ్‌ఎంసీ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నారు.

ఇదీ చూడండి: 'సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.