ETV Bharat / state

చిక్కడపల్లిలోని అక్రమ దుకాణాల తొలగింపు - హైదరాబాద్​ చిక్కడపల్లి

రోడ్డుపై అక్రమంగా ఏర్పాటు చేసిన అక్రమ దుకాణాలను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలతో జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.

చిక్కడపల్లిలోని అక్రమ పాన్​ డబ్బా తొలగింపు
చిక్కడపల్లిలోని అక్రమ పాన్​ డబ్బా తొలగింపు
author img

By

Published : Dec 21, 2019, 5:44 PM IST

చిక్కడపల్లిలోని అక్రమ పాన్​ డబ్బా తొలగింపు
హైదరాబాద్​ చిక్కడపల్లిలోని పెండేకంటి లా కళాశాల పరిసరాల్లో అక్రమంగా పాన్​ డబ్బాను గ్రేటర్ అధికారులు తొలగించారు. ఈ దుకాణంపై స్థానికులు పలుమార్లు జీహెచ్​ఎంసీ, ట్రాఫిక్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు స్పందించకపోనందున హైకోర్టును ఆశ్రయించారు.

ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు అందుకున్న జీహెచ్​ఎంసీ అధికారులు.. పోలీసుల సాయంతో ఆ డబ్బాను తొలగించారు. ఆ షాపునకు విద్యుత్​ సరఫరా ఎవరిచ్చారని అధికారులు ప్రశ్నించారు. ఈ తొలగింపుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:"మహానగరంలో ఆధునిక డిజైన్లతో కొత్త బస్ షెల్టర్లు"

Intro: రోడ్డుపై అక్రమంగా ఏర్పాటుచేసిన డబ్బాను హైకోర్టు ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించారు

Body:రోడ్డుపై ఫుట్పాత్పై అక్రమంగా ఏర్పాటుచేసిన డబ్బాలను తొలగించడంలో అనేక ఇబ్బందులు ఎదురవు తున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని తొలగించడానికి జిహెచ్ఎంసి సన్నద్ధమైంది ముషీరాబాద్ చిక్కడపల్లి లోని పెండేకంటి లా కళాశాల పరిసరాల్లో అక్రమంగా పెద్ద డబ్బా ను ఏర్పాటు చేశారు ఈ డబ్బాలో ప్రతిరోజు వ్యాపారం చేయడం వల్ల స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనివల్ల తమ ఆరోగ్యం తీవ్రంగా నష్టపోతున్న ట్లు స్థానికులు పలుమార్లు జిహెచ్ఎంసి,,, ట్రాఫిక్ పోలీసు అధికారుల ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో స్థానికులు హైకోర్టును ఆశ్రయించి ఈ డబ్బా తొలగింపుకు హైకోర్టు నుండి ఉత్తర్వులను జిహెచ్ఎంసి అధికారులకు పంపారు దీంతో జిహెచ్ఎంసి అధికారులు డెమాలుషన్ స్క్వాడ్ పోలీసు పహారా మధ్య ఆ డబ్బాను పూర్తిగా తొలగించారు దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు అనేక ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వాళ్లను కూడా తొలగించాలని పలువురు ప్రభుత్వానికి విన్నవించారు.....

Conclusion:రోడ్డుపై అక్రమంగా ఏర్పాటుచేసిన డబ్బాకు విద్యుత్ సరఫరాను ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.