గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ తొలి కౌన్సిల్ సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఎప్పుడైనా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కరోనా రెండో దఫా కేసులు పెరుగుతుండటంతో ఆన్లైన్ సమావేశాలపై ఆలోచన చేస్తున్నామని మేయర్ తెలిపారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో 150 మంది కార్పొరేటర్లు భౌతిక దూరం పాటించేంత సీటింగ్ సౌకర్యం లేదని మేయర్ అన్నారు. కరోనా కేసుల నేపథ్యంలో చెత్త తరలింపుపై ప్రధానంగా దృష్టిసారించినట్లు చెప్పారు. డస్ట్‌బిన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను ఉంచాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్