ETV Bharat / state

'ఆ ఆస్తులకు నిబంధ‌న‌ల ప్రకారం ప‌రిహారం చెల్లించే అవ‌కాశం లేద‌ు' - ఉప్పల్​ లింక్​రోడ్డు వార్తలు

హైదరాబాద్​ ఉప్పల్ న‌ల్లచెరువు లింక్‌రోడ్‌తో ఆస్తులు కోల్పోయే 27 మందితో జీహెచ్​ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ సమావేశమయ్యారు. న‌ల్లచెరువు ఎఫ్​టీఎల్​, బ‌ఫ‌ర్‌జోన్‌లో ఉన్న స్థలాల్లో నిర్మాణాల‌కు ప్రభుత్వం అనుమ‌తులు ఇవ్వడం లేదన్నారు. అలాంటిచోట్ల ఉన్న ఆస్తుల‌కు నిబంధ‌న‌ల ప్రకారం ప‌రిహారం చెల్లించే అవ‌కాశంలేద‌ని వివ‌రించారు.

ghmc mayor
ghmc mayor
author img

By

Published : Oct 2, 2020, 2:33 PM IST

హైదరాబాద్​ ఉప్పల్ న‌ల్లచెరువు నుంచి 1.20 కిలోమీట‌ర్ల పొడ‌వు నిర్మించ‌నున్న లింక్‌రోడ్‌తో... ఆస్తులు కోల్పోయే 27 మందితో జీహెచ్​ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్రత్యేకంగా చ‌ర్చించారు. న‌ల్లచెరువు ఎఫ్​టీఎల్​, బ‌ఫ‌ర్‌జోన్‌లో ఉన్న స్థలాల్లో నిర్మాణాల‌కు ప్రభుత్వం అనుమ‌తులు జారీచేయ‌డంలేద‌ని తెలిపారు. అలాంటిచోట్ల ఉన్న ఆస్తుల‌కు నిబంధ‌న‌ల ప్రకారం ప‌రిహారం చెల్లించే అవ‌కాశంలేద‌ని వివ‌రించారు.

జీహెచ్​ఎంసీ ద్వారా టీడీఆర్​ జారీచేసే వెసులుబాటు ఉన్నట్లు మేయర్​ తెలిపారు. కాబట్టి ఆస్తులు కోల్పోతున్నవారు టీడీఆర్​లు తీసుకునేందుకు ఆలోచించుకోవాల‌ని సూచించారు. అన్ని అంశాల‌ను చ‌ర్చించుకొని వారంలో త‌మ నిర్ణయం చెప్పాలన్నారు. బల్దియా చేపడుతున్న అభివృద్ధి ప‌నుల‌కు స‌హ‌క‌రించాల‌ని బొంతు రామ్మోహ‌న్ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి : భువనగిరిలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.