గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఉపమేయర్ అభ్యర్థిని ఈనెల 11నే ప్రకటించనున్నట్లు తెరాస అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్నిక రోజున ఉదయం కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులందరూ తెలంగాణ భవన్‌కు రావాలని.. అక్కడి నుంచే జీహెచ్ఎంసీకి వెళ్లాలని కేసీఆర్ స్పష్టం చేశారు. సీల్డ్కవర్లో అభ్యర్థుల వివరాలు పంపిస్తామని, సమావేశానికి వెళ్లిన తర్వాత తెరిచి, కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు.. పార్టీ ఖరారు చేసిన వారికే ఓటేయాలని కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు.
కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత జడ్పీ చైర్పర్సన్లతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటు వారితో చర్చించారు. గ్రామీణాభివృద్ధిలో జిల్లా పరిషత్‌లు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందని.. అందుకోసం ప్రభుత్వపరంగా ప్రణాళికలు ఉన్నాయన్నారు.
జడ్పీ ఛైర్మన్లలకు క్వార్టర్స్..
రానున్న బడ్జెట్లో ఒక్కో జిల్లా పరిషత్‌కు పది కోట్ల రూపాయలు కేటాయించే ఆలోచన ఉందని కేసీఆర్ తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ల నిధులు, విధుల కేటాయింపుపై చర్చించేందుకు త్వరలో ప్రగతిభవన్‌లో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో జడ్పీ ఛైర్పర్సన్లకు క్వార్టర్స్ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ