వర్షకాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాళాల వెడల్పుపై దృష్టి పెట్టామని... జూలై 15 వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే వానకాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయినట్లు తెలిపారు. ముంపు ప్రాంతాలు...సమస్యాత్మక ప్రాంతాలను తగ్గించుకుంటూ వస్తున్నామని మేయర్ చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు ఏడాదిన్నర కాలం లక్ష్యంగా చేసుకుని పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ వల్ల భూసేకరణలో కొంత ఆలస్యమైందన్నారు. ఆరు నెలలుగా ఎస్‌ఆర్‌డీపీ, నాళాల వెడల్పు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
ఇవీ చూడండి: కేటీఆర్కు రేవంత్ రెడ్డి బహింరంగ లేఖ